Wednesday, June 2, 2010

రాలిపోయే - మాతృదేవోభవ

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మ కలిసి మాచిలకా పాడకు నిన్నటి నీ రాగం

రాలిపోయే||

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాఢగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై

రాలిపోయే||

అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశము నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై నీ జతకే వేన్నియవై

రాలిపోయే||

రామ చక్కని సీతకి -గోదావరి

నీల గగన...ధలవి చలన... ధరని జాత్రీ రమణ
ఆ అ ఆ అ అ అ ఆ
మధుర వదన...నళిన నయన...మనవి వినరా రామ




రామ చక్కని సీతకి...అరచేత గోరింత
ఇంత చక్కని చుక్కకి...ఇంకెవరు మొగుడంట
ఉడత వీపున వేలు విడిచిన...పుడమి అల్లుడు రాముడె
ఎడమ చేతను శివుని విల్లును...ఎత్తిన ఆ రాముడె
ఎత్తగలడ!! సీత జడను తాళి కట్టె వేళలో


రామ చక్కని సీతకి...


ఎర్ర జాబిలి చెయ్యి గిల్లె...రాముడేడని అడుగుతుంటె
చూడలేదని పెదవి చెప్పె...చెప్పలేమని కనులు చెప్పె
నల్ల పూసై నాడు దేముడు...నల్లని రఘురాముడే


రామ చక్కని సీతకి...


చుక్కనడిగా దిక్కునడిగా...చమ్మ గిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన...నీటి తెరలే అడ్డు నిలిచె
చూపుకోమని మనసు తెలిపె...మనసు మాటలు కాదుగ


రామ చక్కని సీతకి...అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి...ఇంకెవరు మొగుడంట


రామ చక్కని సీతకి...


ఇందువదన కొందలదన...మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంతమదన ప్రేమ

మనసా వాచా -గోదావరి

మనసా వాచా నిన్నే వలాచా నిన్నే ప్రేమిన్చా
నిన్నే తలాచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా


చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా
మూగైపోయా నేనిలా


నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసమ్ సీతలా